మాయాబ‌జార్ మ‌ళ్లీ తీశారు

Key scene in Mayabazar recreated
Friday, October 20, 2017 - 22:45

కేవీ రెడ్డి అద్భుత క‌ళాసృష్టి...మాయాబ‌జార్‌. ఇన్ని ద‌శాబ్దాలు గ‌డిచినా.. ఈ చిత్ర‌రాజం వ‌న్నె త‌ర‌గ‌లేదు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఆల్‌టైమ్ గ్రేట్ క్లాసిక్‌గా మిగిలింది. ఈ సినిమాని ఇపుడు మ‌ళ్లీ తీశారు, పునఃసృష్టించారు. మొత్తంగా తీయ‌లేదు కానీ మాయాబ‌జార్‌లోని కీల‌క స‌న్నివేశాన్ని రిక్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్‌.

నాగ అశ్విన్ "మ‌హాన‌టి" పేరుతో సావిత్రి జీవిత చ‌రిత్ర‌ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా మాయాబజార్‌లో సావిత్రి న‌టిస్తున్న వైనాన్ని చిత్రీక‌రించాడు నాగ అశ్విన్ హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో. ఆ సీన్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత సీన్ అద్భుతంగా వ‌చ్చింద‌న్న ఆనందంలో ఉన్న నాగ అశ్విన్ ఎమోష‌న్‌ని వీడియోలో బంధించారు ఆయ‌న వ‌దిన‌, చిత్ర‌నిర్మాత‌ల్లో ఒక‌రైన స్వ‌ప్న ద‌త్ చ‌ల‌సాని. ఈ వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

మ‌హాన‌టి సావిత్రిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఎన్టీఆర్ పాత్ర ఎవ‌రు చేయ‌నున్నార‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ల‌వ‌ర్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన టాలెంటెడ్ డైర‌క్టర్స్‌లో నాగ అశ్విన్ ఒక‌రు. ఆయ‌న తీసిన తొలి చిత్రం.. "ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం".