అనుష్క‌కి మ‌రో చాలెంజింగ్ పాత్ర‌

Anushka as Jamuna in Savitri
Thursday, April 27, 2017 - 13:30

‘మహానటి’ పేరుతో సావిత్రి జీవిత‌గాథ‌ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు  నాగ్‌ అశ్విన్‌. సావిత్రిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. సమంత కీలక పాత్రల్లో న‌టిస్తోంది.  వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు  సమాచారం. అలనాటి నటి జమున పాత్రలో ఆమె న‌టించ‌నుంద‌ట‌. 

జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోంది. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.