తెరపై బాడీ చూపించే సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే అందరూ ఈ పని చేయలేదు. ఎవరి పరిమితులు వాళ్లకు ఉన్నాయి. కొందరు ఇలా షర్ట్ లేకుండా నటించడానికి వ్యతిరేకం. మహేష్ బాబు లాంటి హీరోలు ఈ కోవలోకి వస్తారు. మరికొందరికి షర్ట్ లేకుండా ఛెస్ట్ చూపించాలని ఉన్నప్పటికీ వయసు సహకరించదు. చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు ఈ పనులు చేయలేరు. అయితే బాలయ్య మాత్రం నా రూటే సెపరేట్ అంటున్నాడు.
బోయపాటి సినిమాల్లో వెరైటీ ఏం ఉంటుంది అనే కామెంట్స్ వస్తుంటాయి. హీరో కత్తి పట్టుకొని నరుకుతూ పోతాడు, సేమ్ వయొలెన్స్ నో వెరైటీ అనే వాళ్లున్నారు. అయితే ఈసారి మాత్రం బోయపాటి తన స్టయిల్ మార్చాడట. సారి తన హీరోను వెరైటీ చూపిస్తాను అంటున్నాడు బోయపాటి. తనని ట్రోల్ చేసున్నావారి నోళ్లు మూయించేలా.. బాలయ్య క్యారెక్టర్ ఉంటుంది అంట.