బాలయ్య కూడా విప్పేస్తాడట

Nandamuri Balakrishna to showcase his bare chest in Ruler
Thursday, November 21, 2019 - 12:30

తెరపై బాడీ చూపించే సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే అందరూ ఈ పని చేయలేదు. ఎవరి పరిమితులు వాళ్లకు ఉన్నాయి. కొందరు ఇలా షర్ట్ లేకుండా నటించడానికి వ్యతిరేకం. మహేష్ బాబు లాంటి హీరోలు ఈ కోవలోకి వస్తారు. మరికొందరికి షర్ట్ లేకుండా ఛెస్ట్ చూపించాలని ఉన్నప్పటికీ వయసు సహకరించదు. చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు ఈ పనులు చేయలేరు. అయితే బాలయ్య మాత్రం నా రూటే సెపరేట్ అంటున్నాడు.

59 సంవత్సరాల వయసులో షర్ట్ లేకుండా నటించడానికి సిద్ధమౌతున్నాడు బాలయ్య. అవును.. ప్రస్తుతం చేస్తున్న రూలర్ సినిమాలోనే షర్ట్ విప్పి, తన ఛాతి చూపించబోతున్నాడు. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ఇలా సిద్ధమౌతున్నాడు ఈ నటసింహం. వచ్చే వారం నుంచి ఈ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. క్యారెక్టర్ కోసం దేనికైనా రెడీ అనే టైపు బాలయ్య. అందుకే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం బాగా బరువుతగ్గి స్లిమ్ అయ్యాడు. ఇప్పుడు ఓ కీలకమైన ఫైట్ కోసం ఇలా షర్ట్ లేకుండా నటించబోతున్నాడు.

ఈ వయసులో ఇలా నటించాలంటే చాలా హార్డ్ వర్క్ అవసరం. మరీముఖ్యంగా ముసలి ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడాలి. ఛాతి బాగా కనిపించాలంటే ఎక్సర్ సైజులు కూడా చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు బాలయ్య. బాలీవుడ్ లో లేటు వయసులో కూడా ఇలాంటి నాటు సన్నివేశాలు చేశారు కొందరు హీరోలు. షారూక్, సైఫ్, అజయ్ దేవగన్ లాంటి హీరోలు ఈ లిస్ట్ లోకి వస్తారు. తెలుగులో మాత్రం ఇలాంటి ప్రయత్నాలు తక్కువ. నాగ్ ఒక్కడు మినహాయిస్తే, మరెవ్వరూ ఇలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు నాగ్ కు పోటీ బాలయ్య రెడీ అవుతున్నాడన్నమాట.