ఈసారి బాలయ్య కొత్తగా కనిపిస్తాడట

Boyapati to present Balakrishna in new look
Sunday, November 17, 2019 - 18:00

బోయపాటి సినిమాల్లో వెరైటీ  ఏం ఉంటుంది అనే కామెంట్స్ వస్తుంటాయి. హీరో కత్తి పట్టుకొని నరుకుతూ పోతాడు, సేమ్ వయొలెన్స్ నో వెరైటీ అనే వాళ్లున్నారు. అయితే ఈసారి మాత్రం బోయపాటి తన స్టయిల్ మార్చాడట. సారి తన హీరోను వెరైటీ చూపిస్తాను అంటున్నాడు బోయపాటి. తనని ట్రోల్ చేసున్నావారి నోళ్లు మూయించేలా.. బాలయ్య క్యారెక్టర్ ఉంటుంది అంట.

త్వరలోనే బాలయ్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం నడుస్తున్న రూలర్ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య చేయబోయేది బోయపాటి మూవీనే. ఈ మూవీలో బాలయ్యను కొత్తగా చూపించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాడట బోయపాటి. సింహా సినిమాలో బాలయ్య గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే లెజెండ్ సినిమాలో కూడా బాలయ్య గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు గెటప్స్ ను మించేలా బాలయ్యను తన కొత్త సినిమాలో చూపించబోతున్నాడట బోయపాటి.

కేవలం గెటప్ లోనే కాకుండా.. సినిమాలో కూడా వైవిధ్యం చూపిస్తాడట. నరుక్కోవడం, భారీ డైలాగ్స్ కు భిన్నంగా ఈసారి తననుతాను కొత్తగా, విభిన్నంగా అవిష్కరించుకోబోతున్నాడట. చూస్తుంటే.. ఈసారి బోయపాటి నుంచి కాస్త కొత్త స్టఫ్ వచ్చేలా ఉంది. వినయ విధేయ గాయాలు మానాలంటే బోయపాటి ఈమాత్రం మారాల్సిందే కదా.