"గాడ్, సెక్స్, ట్రూత్" అనే వీడియో ఫిల్మ్‌కి సంబంధించి వివాదం నడుస్తున్న టైమ్‌లో వర్మ ఒక సామాజిక కార్యకర్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో సామాజిక కార్యకర్త దేవీ ఆర్జీవీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుకి సంబంధించిన విచారణలో భాగంగా రామ్‌గోపాల్ వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణకి వచ్చారు.
పోలీసులు ఆయన ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. నాలుగు గంటలపాటు సాగింది విచారణ. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని తెలిపారు. పోలీసులకి వర్మ కొంత విచిత్రమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
"గాడ్ సెక్స్ ట్రూత్" పేరుతో వర్మ తీసిన పోర్న్ చిత్రం జనవరి 26న విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్‌గోపాల్ వర్మ అనేక టీవీ చానెల్స్‌లో పాల్గొన్నాడు. ఆ సందర్బంలో జరిగిన చర్చల్లో ప్రముఖ సామాజికవేత్తపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" రెండో భాగాన్ని మణి అనే సామాజికవేత్తతో తీస్తానని ప్రకటించాడు వర్మ. మియా ముఖం కన్నా మణి ముఖం నాకు అందంగా కనిపిస్తోందని వర్మ టీవీ చర్చలో రెచ్చిపోయాడు. దాంతో దేవీ అనే మరో ప్రముఖ సామాజిక వేత్త వర్మకి వ్యతిరేఖంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు.
చిన్న సినిమా కావొచ్చు..బిగ్ (బి) మూవీ కావొచ్చు, వర్మ తీస్తే చాలు చానెల్స్ ఎగబడి లైవ్ డిస్కోలు పెట్టేస్తాయి. అది షార్ట్ ఫిల్మ్ అవొచ్చు...వెబ్ సిరీస్ కావొచ్చు.. అడగకుండానే ఉచితంగా ప్రచారం చేస్తాయి మన తెలుగు న్యూస్ చానెల్స్. ఇపుడు ఆయన ఆధ్యాత్మిక శృంగార చిత్రానికి కూడా తెగ ప్రచారం చేస్తున్నాయి వార్తా చానెల్స్. ఇంతకీ ఆధ్యాత్మిక శృంగార చిత్రం అంటే ఏంటనుకుంటున్నారా?