దేవి ఫిర్యాదు, వ‌ర్మపై కేసు

Hyderabad police file case on RGV regarding porn movie
Thursday, January 25, 2018 - 14:15

"గాడ్ సెక్స్ ట్రూత్" పేరుతో వ‌ర్మ తీసిన పోర్న్ చిత్రం జ‌న‌వ‌రి 26న విడుద‌ల అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా రామ్‌గోపాల్ వ‌ర్మ అనేక టీవీ చానెల్స్‌లో పాల్గొన్నాడు. ఆ సంద‌ర్బంలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ప్రముఖ సామాజిక‌వేత్తపై వ‌ర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. "గాడ్‌, సెక్స్ అండ్ ట్రూత్" రెండో భాగాన్ని మ‌ణి అనే సామాజికవేత్తతో తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. మియా ముఖం క‌న్నా మ‌ణి ముఖం నాకు అందంగా క‌నిపిస్తోంద‌ని వ‌ర్మ టీవీ చ‌ర్చ‌లో రెచ్చిపోయాడు. దాంతో దేవీ అనే మ‌రో ప్ర‌ముఖ సామాజిక వేత్త వ‌ర్మ‌కి వ్య‌తిరేఖంగా పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు.

"దేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసాం. ఫేస్ బుక్ లో పోర్న్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి అతని ఫై 67 ఐటీ ఆక్ట్ కింద కేసు పెట్టాము. దేవీ ఫిర్యాదు  మేరకు 506, 509 సెక్ష‌న్ల‌ కింద కేసు నమోదు చేశాం. రామ్ గోపాల్ వర్మ ని కచ్చితం గా విచారిస్తాం. వర్మ తప్పు చేసినట్టు తేలితే కచ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌"ని పోలీసులు చెపుతున్నారు.