వ‌ర్మ‌కి హైద‌రాబాద్ పోలీసు ట్రీట్‌మెంట్‌

Ram Gopal Varma loves professionalism of Hyderabad police
Saturday, February 17, 2018 - 20:15

"గాడ్, సెక్స్, ట్రూత్" అనే వీడియో ఫిల్మ్‌కి సంబంధించి వివాదం న‌డుస్తున్న టైమ్‌లో వ‌ర్మ ఒక సామాజిక కార్య‌క‌ర్త గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దాంతో సామాజిక కార్య‌కర్త దేవీ ఆర్జీవీకి వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుకి సంబంధించిన విచార‌ణ‌లో భాగంగా రామ్‌గోపాల్‌ వర్మ హైద‌రాబాద్ సీసీఎస్‌ పోలీసుల విచార‌ణ‌కి వ‌చ్చారు.

పోలీసులు ఆయ‌న ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశారు. నాలుగు గంట‌లపాటు సాగింది విచార‌ణ‌. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని తెలిపారు. పోలీసుల‌కి వ‌ర్మ కొంత విచిత్ర‌మైన స‌మాధానాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని పోలాండ్‌, యూకేలో చిత్రీక‌రించాన‌ని వ‌ర్మ తెలిపారు. అందులో న‌టించిన మియా మిల్కోవాని తాను ఎపుడూ ప్ర‌త్య‌క్షంగా క‌ల‌వ‌లేద‌ని త‌ర్వాత మీడియాకి చెప్పారు వ‌ర్మ‌. మ‌రి సినిమా ఎలా తీశారు అని అడిగితే.. స్కైప్‌లో తాను సూచ‌న‌లు ఇచ్చాన‌ని, తాను లైవ్ వీడియాలో ఇచ్చిన డైర‌క్ష‌న్‌ని..త‌న టీమ్ లొకేష‌న్‌లో ఉండి తీసింద‌ని చెప్ప‌డం విశేషం. అయితే ఇదంతా కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు టెక్నిక‌ల్ సాకుగా భావిస్తున్నారు పోలీసులు.

అయితే హైద‌రాబాద్ పోలీసుల ప్రొఫెషిన‌లిజం వ‌ర్మ‌కి న‌చ్చింద‌ట‌. ఒక ఫోటోని సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేశారు వ‌ర్మ‌.