మాల్కోవా..ఎవరంట ఎవరంట ఈ పాలకోవా!
చిన్న సినిమా కావొచ్చు..బిగ్ (బి) మూవీ కావొచ్చు, వర్మ తీస్తే చాలు చానెల్స్ ఎగబడి లైవ్ డిస్కోలు పెట్టేస్తాయి. అది షార్ట్ ఫిల్మ్ అవొచ్చు...వెబ్ సిరీస్ కావొచ్చు.. అడగకుండానే ఉచితంగా ప్రచారం చేస్తాయి మన తెలుగు న్యూస్ చానెల్స్. ఇపుడు ఆయన ఆధ్యాత్మిక శృంగార చిత్రానికి కూడా తెగ ప్రచారం చేస్తున్నాయి వార్తా చానెల్స్. ఇంతకీ ఆధ్యాత్మిక శృంగార చిత్రం అంటే ఏంటనుకుంటున్నారా?
మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌ని తీసుకొచ్చి "గాడ్ సెక్స్ ట్రూత్" పేరుతో ఆర్జీవీ పోర్న్ మూవీ తీశాడు. ఐతే ఇది పోర్న్ సినిమా అని చీప్‌గా మాట్లాడొద్దు అంటారు వర్మ. ఆయన దృష్టిలో ఇది ఫిలాసాఫికల్ ట్రీటైస్ అంట. అంత పెద్ద మాటలు మనకి అర్థం కావులే. సింపుల్‌గా చెప్పాలంటే ఇది శృంగార చిత్రమే కానీ ఇందులో ఆధ్యాత్మిక కోణం ఉందనేది ఆయన భావన.
సరే ఇపుడు డిస్కో..అదేనండి డిస్కషన్ ఆర్జీవీ గురించి కాదు మాల్కోవా గురించి. ఎవరీ భామ. "ఎవరంట ఎవరంట ఈ మాల్కొవా..ఏ తల్లికి పుట్టిందో ఈ పాలకోవా," అంటూ బాహుబలి సాంగ్ రేంజ్‌లో జనాలు పాడుకుంటున్నారు.
పాతికేళ్ల ఈ పాలకోవా పుట్టింది అమెరికాలో. పోర్న్ సినిమాల నటి. ఆమె సోదరుడు కూడా పోర్న్ సినిమాల్లో నటిస్తాడు. అంతెందుకు ఆమె మాజీ భర్త కూడా పోర్న్ స్టారే.
ఆమెని ఇండియాలో సన్నీలియోన్‌లా పాపులర్ చేయాలని వర్మ తీసుకొచ్చాడు. ఐతే ఆమెతో బాలీవుడ్ మసాలా సినిమా తీయడం లేదు. స్త్రీ శరీరంలోని అణువణువూ అందమే అని గొప్ప ఫిలాసఫికల్ భావనని తన చిత్రంతో రుజువు చేయాలనుకుంటున్నాడు వర్మ. అందుకే గాడ్, సెక్స్, ట్రూత్‌ని తీశాడు. అలా మనం ఈ మాల్కోవా గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.
- Log in to post comments