ఇక ఎటువంటి అనుమానాలకి తావులేదు. మూడు రోజుల అనంతరం దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసుని క్లోజ్ చేశారు. ఆత్మహత్యనా, హత్యనా.. అంటూ మీడియా సాగిస్తున్న కథనాలకి పూర్తిగా తెరపడింది.
దుబాయ్ పోలీసులు రిపోర్ట్ అందించారు. ఆమె నీటిలో మునగడం వల్లే చనిపోయిందని ఆ నివేదికలో తేల్చారు. మరి ఆమె బాత్‌టబ్బులో ఎలా మునిగిందనేదానికి కూడా సమాధానం ఇచ్చారు ఆ రిపోర్ట్‌లో. అన్‌కాన్సియస్ కావడం వల్లే మునిగిందని తేల్చారు. ఆమె ఎందుకు స్పృహ కోల్పోయింది అంటే.. బాగా మద్యం సేవించడమే! ఎందుకంటే ఆమె రక్తనమూనాల్లో అధికంగా ఆల్కహాల్ శాతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
శ్రీదేవి చనిపోయి మూడు రోజులు గడిచింది. ఆమె పార్థివ దేహం ఇండియాకి ఎపుడు వస్తుందనే విషయంలో మంగళవారం మధ్యాహ్నం వరకు క్లారిటీ లేదు. మరోవైపు, దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ని తన హోటల్ రూమ్‌లోనే ఉండాలని చెప్పారట. ఆయనని ఇంటరాగేట్ చేశారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఆయన్ని ఇంటరాగేట్ చేయలేదని ప్రముఖ దుబాయ్ పత్రిక ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.
మరోవైపు, దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు శ్రీదేవి, బోనీ కపూర్‌ల కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్ కాల్ లాగ్ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు గుర్తించారని సమాచారం.
శ్రీదేవి పార్థివ దేహం ఇండియాకి ఎపుడు వస్తుంది? ఈ విషయంలో ఇపుడే క్లారిటీ ఇవ్వలేమంటున్నాయి దుబాయ్ అధికార వర్గాలు. శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని స్పష్టం చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది?
శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ వీడింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించినట్లు భావించారు. ఆ తర్వాత ఫౌల్ ప్లే (నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు) అని దుబాయ్ పోలీసులు అనుమానించారు. అందుకే ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించేందుకు 36 గంటలకి పైగా సమయం తీసుకున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి మరణం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఫిఫ్టీ ప్లస్‌లోనూ తరగని అందంతో అందరూ అసూయపడేలా ఉంటూ ఇటీవలే మామ్ సినిమాతో మరోసారి తన అభినయ కౌశలాన్ని చాటిన శ్రీదేవి గురించి ఇలాంటి వార్త వింటామని ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురుని హీరోయిన్‌గా లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్న శ్రీదేవి గుండెపోటుతో మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వార్త విని షాక్‌లో ఉన్నాన్నారు. చిరంజీవితో ఆమె జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎస్పీ పరుశరామ్‌లోనూ నటించారు.