శ్రీదేవి మ‌ర‌ణం: అస‌లు కార‌ణమిదే

Sridevi died from accidental drowning: Forensic Report
Monday, February 26, 2018 - 17:15

శ్రీదేవి మ‌ర‌ణం వెనుక మిస్ట‌రీ వీడింది. మొద‌ట ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు భావించారు. ఆ త‌ర్వాత ఫౌల్ ప్లే (నేర‌పూరిత ఉద్దేశం ఉన్న‌ట్లు) అని దుబాయ్ పోలీసులు అనుమానించారు. అందుకే ఆమె పార్థివ‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కి అప్ప‌గించేందుకు 36 గంట‌లకి పైగా స‌మ‌యం తీసుకున్నారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కి ఫోరెన్సిక్ రిపోర్ట్ వ‌చ్చింది. ప్ర‌మాద‌వ‌శ‌త్తూ నీట మునిగి మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్ల నివేదిక‌లో తేలింది.

ఆల్క‌హాల్ మ‌త్తులో బాత్‌ట‌బ్‌లోకి దిగ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌.  నీటిలో మున‌క వ‌ల్లే శ్రీదేవి మృతి త‌ప్ప ఆమె మ‌ర‌ణం వెనుక నేర‌పూరిత ఉద్దేశం లేదని డాక్ట‌ర్లు తేల్చారు. ఆమె ర‌క్త న‌మూనాల్లో ఆల్క‌హాల్ శాతం అధికంగానే ఉంది. మద్యం సేవించి బాత్‌ట‌బ్‌లో అడుగుపెట్టిన త‌ర్వాతే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌. గుండెపోటు వ‌ల్ల మ‌ర‌ణించ‌లేదు.

మ‌ద్యం వ్య‌స‌న‌మే ఆమె మ‌ర‌ణానికి కార‌ణం అయింది.