బోనీ ఫ‌స్ట్ ఎవ‌రికి కాల్ చేశాడు

Boney Kapoor call data is being examined by Dubai Police
Tuesday, February 27, 2018 - 11:15

శ్రీదేవి చ‌నిపోయి మూడు రోజులు గ‌డిచింది. ఆమె పార్థివ దేహం ఇండియాకి ఎపుడు వ‌స్తుంద‌నే విష‌యంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క్లారిటీ లేదు. మ‌రోవైపు, దుబాయ్ పోలీసులు బోనీ క‌పూర్‌ని త‌న హోట‌ల్ రూమ్‌లోనే ఉండాల‌ని చెప్పార‌ట‌. ఆయ‌న‌ని ఇంట‌రాగేట్ చేశార‌ని కొన్ని మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. కానీ ఆయ‌న్ని ఇంట‌రాగేట్ చేయ‌లేద‌ని ప్ర‌ముఖ దుబాయ్ ప‌త్రిక ఖ‌లీజ్ టైమ్స్ పేర్కొంది.

మ‌రోవైపు, దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు శ్రీదేవి, బోనీ క‌పూర్‌ల కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. బోనీ క‌పూర్ కాల్ లాగ్‌ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్‌ సింగ్‌ నంబర్‌ ఉన్నట్లు గుర్తించారని స‌మాచారం. 

శ‌నివారం అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో బోనీ కపూర్‌ నాకు కాల్ చేసిన మాట నిజ‌మే అని ఇప్ప‌టికే అమ‌ర్ సింగ్ ఒక మీడియా సంస్థ‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. బాబీ ఇక లేరు అని చెప్పారు. అంతే అంత‌క‌న్నా ఏమీ మాట్లాడ‌లేదని పేర్కొన్నారు అమ‌ర్‌సింగ్‌.

బోనీ మొత్తం కాల్ లిస్ట్ తీసి...అందులో ఏమైనా అనుమాన‌స్ప‌దంగా ఉంటే విచార‌ణ చేసే అవ‌కాశం ఉంది. బోనీ ఫ‌స్ట్ కాల్ ముంబైలోని త‌న కుటుంబ స‌భ్యుల‌కి చేసిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌స్తున్న స‌మాచారం.