శ్రీదేవి మరణం: క్ష‌ణ క్ష‌ణం..ట్విస్ట్‌లు

There will be further delay in releasing Sridevi's remains
Monday, February 26, 2018 - 19:15

శ్రీదేవి పార్థివ దేహం ఇండియాకి ఎపుడు వ‌స్తుంది? ఈ విష‌యంలో ఇపుడే క్లారిటీ ఇవ్వ‌లేమంటున్నాయి దుబాయ్ అధికార వ‌ర్గాలు. శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని స్పష్టం చేసిన త‌ర్వాత కూడా ఎందుకు ఇంత ఆల‌స్యం అవుతోంది?

ఈ రాత్రిలోపు శ్రీదేవి పార్థివ దేహాన్ని ఆమె కుటుంబ స‌భ్యుల‌కి అందచేస్తారా అనేది చూడాలి. అక్క‌డి ప్ర‌భుత్వం, పోలీసు అధికారులు శ్రీదేవి మ‌ర‌ణాన్ని ఒక లీగ‌ల్ కేసుగా టేక‌ప్ చేశారు. అంటే అనేక కోణాల్లో ఇంకా ప‌రిశోధ‌న జ‌రిగాలి. అందుకే ఆల‌స్యం అవుతోంద‌ట‌. అధికంగా మ‌ద్యం సేవించి బాత్‌ట‌బ్బులో మ‌రణించిన‌ట్లు స‌మాచారం. ఐతే శ్రీదేవి, ఆమె భ‌ర్త బోనీక‌పూర్ కాల్ డాటాని కూడా ప‌రిశీలించిన త‌ర్వాతే విచార‌ణ ముగిస్తార‌ట‌. మంగ‌ళ‌వారం ఉద‌యం కానీ బాడీ వ‌చ్చే అవ‌కాశం లేద‌నేది లేటెస్ట్ టాక్‌.

శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదిక సోమ‌వారం మ‌ధ్యాహ్న‌మే విడుదలైంది. బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్‌ నివేదిక నిర్ధారించింది. ఆమె శరీరంలో ఆల్కహాల్‌ నమూనాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.