ఎన్టీఆర్ బయోపిక్ కొత్త షెడ్యూల్ సోమవారం (ఆగస్ట్ 13) నుంచి ప్రారంభం అవుతుంది. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తున్న ఈ బయోపిక్‌లో బసవతారకం పాత్రని పోషిస్తోంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఎన్టీఆర్ భార్య బసవతారకం గురించి సాధారణ ప్రజలకి తెలిసింది తక్కువ. మామూలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తే...బసవతారకం పాత్రకి పెద్దగా స్పేష్ ఉండదు. మరి అలాంటి చిన్న పాత్రకి విద్యాబాలన్ ఎందుకు ఒప్పుకొంది. ఆ విషయం ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.
ఎన్టీఆర్ బయోపిక్‌ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్‌గా పూర్తి చేయగలరా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని క్రిష్ వద్ద ప్రస్తావించాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9న విడుదల చేయాలని చంద్రబాబు క్రిష్‌కి, బాలయ్యకి స్పష్టం చేశాడట.
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్‌లో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చిన్న పాత్రలో కనిపించనున్నారు. కైకాల తన కెరియర్‌ని ఎన్టీ రామారావుకి డూప్ నటించడంతోనే ప్రారంభించారు. అదే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు.
తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు కైకాల. కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారట. ఆయన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు దర్శకుడు.