నారా పాత్రలో రానా షూటింగ్ షురూ

రానా దగ్గుబాటి నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నాడనేది పాత న్యూసే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడుగా రానా కనిపిస్తాడు. సోమవారం (ఆగస్ట్ 13) నుంచి షూటింగ్ మొదలు అయింది. తొలి రోజు ఫోటోలను షేర్ చేశాడు రానా. చంద్రబాబు ఫోటోలను తన మేకప్ రూమ్‌లో పెట్టుకొని... ఆయన గెటప్ వేసుకుంటున్నట్లుగా అనిపిస్తున్న ఫోటోలను షేర్ చేశాడు రానా. తన గెటప్‌ని రివీల్ చేయలేదు.
చంద్రబాబు యంగ్‌గా ఉన్నప్పటి టైమ్‌ని మాత్రమే ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారు. సో..రానా ఆ విధంగా తన మీసాలను కూడా పెంచుకున్నాడు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుని అమరావతిలో కలిసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు రానా.
ఎన్టీఆర్ బయోపిక్‌ని దర్శకుడు క్రిష్ తీస్తున్నాడు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది ఎన్టీఆర్ మూవీ.
- Log in to post comments