ఎన్టీఆర్ ఆత్మకథలో విద్యాబాలన్ కీలకం!

ఎన్టీఆర్ బయోపిక్ కొత్త షెడ్యూల్ సోమవారం (ఆగస్ట్ 13) నుంచి ప్రారంభం అవుతుంది. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తున్న ఈ బయోపిక్‌లో బసవతారకం పాత్రని పోషిస్తోంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఎన్టీఆర్ భార్య బసవతారకం గురించి సాధారణ ప్రజలకి తెలిసింది తక్కువ. మామూలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తే...బసవతారకం పాత్రకి పెద్దగా స్పేష్ ఉండదు. మరి అలాంటి చిన్న పాత్రకి విద్యాబాలన్ ఎందుకు ఒప్పుకొంది. ఆ విషయం ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.
సినిమా మొదలు, చివర...విద్యాబాలన్‌తోనే ఉంటుందట. బసవతారం కోణంలోనే ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నాడట దర్శకుడు క్రిష్. అంటే ఆమె వాయిస్ ఓవర్‌తో ఎన్టీఆర్ కథ మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. మహానటి సినిమాని సమంత క్యారక్టర్‌తో ప్రారంభించి, ఎండ్ చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. ఎన్టీఆర్ బయోపిక్‌ని ఆయన భార్య కోణంలో చూపిస్తున్నారన్నమాట.
ఎన్టీఆర్ జీవితంలో కొన్ని విషాద సంఘటనలున్నాయి. కొన్ని వివాదస్పద కోణాలున్నాయి. అలాగే ఆయన్ని వెన్నుపోటు పొడిచింది ఆయన అల్లుడే. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు (వైస్రాయ్ సంఘటన) అంశాన్ని చూపించకూడదంటే బసవతారకం కోణంలో ఎన్టీఆర్ ఆత్మకథని తీస్తే ఎలా ఉంటుందని దర్శకుడు ఆలోచన వల్లే స్ర్కిప్ట్‌లో మార్పు జరిగిందట. అందుకే విద్యాబాలన్ ఈ పాత్రని అంగీకరించింది.
ఈ బయోపిక్‌లో నటించడం గొప్ప అనుభూతినిస్తోందని ఇప్పటికే విద్యాబాలన్ చెప్పింది.
- Log in to post comments