రిలీజ్ డేట్ ఛేంజ్ చేయొద్దు: చంద్రబాబు

ఎన్టీఆర్ బయోపిక్‌ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్‌గా పూర్తి చేయగలరా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని క్రిష్ వద్ద ప్రస్తావించాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9న విడుదల చేయాలని చంద్రబాబు క్రిష్‌కి, బాలయ్యకి స్పష్టం చేశాడట.
సీఎం చంద్రబాబును బాలకృష్ణ, క్రిష్, రానా శుక్రవారం రాత్రి అమరావతిలో కలిశారు. బయోపిక్ విషయమై చర్చించారు. రానా చంద్రబాబు నాయుడు పాత్రని పోషించనున్నాడు. దాంతో ఆయనకి ఈ విషయం స్వయంగా రానాతో చెప్పించేందుకు బాలయ్య, క్రిష్ తీసుకెళ్లారు. రానా, ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులే.
ఎన్టీఆర్ బయోపిక్ ఎన్నికలకి రెండు నెలల ముందు విడుదలైతే పొలిటికల్ మైలేజ్ ఉంటుందనేది సీఎం నాయుడు భావన. అందుకే క్రిష్‌కి రిలీజ్ డేట్ మార్చొద్దని బాబు చెప్పినట్లు సమాచారం.
శనివారం నాడు ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో బాలకృష్ణ, క్రిష్ పర్యటించారు. అలాగే కొమరవోలు వెళ్లి ఎన్టీఆర్ భార్య బసవతారకం బంధువులతో ముచ్చటించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆగస్ట్ 13న ప్రారంభం అవుతుంది.
- Log in to post comments