1995 వైస్రాయ్ ఉదంతం చూసిన వారు, ఆనాటి రాజకీయ పరిణామాలను గమనించిన వారు ఎవరైనా.. వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రయిలర్‌ని ఇష్టపడుతారు. దాదాపుగా ఆనాటి పరిస్థితులను తన సినిమాలో ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది. లక్ష్మీపార్వతికి ఎందరితోనూ సంబంధాలున్నాయనీ అప్పట్లో వినిపించిన పుకార్లను కూడా ఉన్నదున్నట్లుగా డైలాగ్ ద్వారా పెట్టాడు వర్మ. ఈ కొత్త ట్రయిలర్‌లో వినిపించిన డైలాగ్‌లు అన్ని అప్పట్లో ఆన్ ది రికార్డో, ఆఫ్ ది రికార్డో విన్నవే.