రాంగోపాల్ వర్మని సినిమా సెలబ్రిటీలంతా అభిమానంగా రామూ అని పిలుస్తారు. జనాలకి ఆయన ఆర్జీవీ, సన్నిహితులకి రామూ. కానీ ఈ రాముడు దేవుడ్ని నమ్మడు. ఆయన పరమ నాస్తికుడు.
అలాంటి నాస్తికవాది ఈ రోజు అన్నమయ్యగా మారిపోయాడు. తిరుమల దేవుడ్ని పూజించాడు. పరమ భక్తుడిగా పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ప్రసాదాలు అందుకున్నాడు. శాలువా కూడా తీసుకున్నాడు. తన జీవితంలో మొదటిసారిగా గుడికి వెళ్లానని ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.