రాంగోపాల్ వర్మ ట్వీట్లు, ఆయన మాటలు చూసి జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకి ఆడవాళ్ల పిచ్చి అని ఒక ఇమేజ్ పడిపోయింది. కానీ ఇన్నేళ్ల కెరియర్‌లో ఏ హీరోయిన్ కూడా వర్మ గురించి చెడుగా మాట్లాడలేదు. ఆర్జీవీ అడ్డగోలుగా మాట్లాడినట్లు అనిపించినా..వ్యక్తిగా హి ఈజ్ జెంటిల్‌మెన్. ఆ విషయాన్ని హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా ధృవీకరించింది.
హాస్య నటుడు ఆలీ నిర్వహిస్తోన్న టీవీ షోలో కలర్స్ స్వాతి బోలేడన్నీ విషయాలు చెప్పుకొచ్చింది. అందులో వర్మ గురించి చేసిన కామెంట్ ఆసక్తికరం. ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంది ఆమె మాట.
రాంగోపాల్ వర్మ గొప్ప దర్శకుడు (అఫ్‌కోర్స్ గిట్టనివాళ్లు అది ఒకప్పటి మాట అని అంటారు). ఇపుడు వర్మ తీస్తున్న సినిమాలు గొప్ప దర్శకుడు అన్న ట్యాగ్‌కి ఏ మాత్రం నప్పవు అని ఆయన అభిమానులు కూడా ఒప్పుకుంటారు. అయితే ఎంత వరస్ట్ మూవీలో అయినా ఆయన తీసే సినిమాల్లో ఏదో ఒక ప్రయోగం ఉంటుంది. ఫిల్మ్ లవర్స్‌కి పనికొచ్చే టెక్నిక్ ఉంటుంది.
సినిమాలకి సంబంధించిన విషయాలే కాదు తెలుగునాట కీలకమైన ప్రతి రాజకీయ పరిణామంపై తనదైన శైలిలో పోస్ట్‌లు పెట్టడం రాంగోపాల్ వర్మ శైలి. తాజాగా ఆయన తెలంగాణ మాజీ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డిని బాహుబలి అని డిక్లేర్ చేశాడు. తెలంగాణలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల నాటికి బాహుబలి వస్తాడని ఆ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ బాహుబలి రేవంత్ రెడ్డి అని వర్మ ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది.
రాంగోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" గురించి తెలుగు దేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంగళవారం వివరించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడనీ, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనీ వర్మతో ఈ సినిమా తీయిస్తున్నారని పార్టీ నేతలు ఆయనకి తెలిపారు. ఐతే ఈ సినిమా విషయంలో అతిగా ఆవేశపడొద్దని పార్టీ నేతలకి సూచించారు. వర్మ సినిమాకి పెద్ద ప్రజాదరణ ఉండదన్నారు సీఎం.
జనం పట్టించుకోని సినిమాల గురించి మీరు ఆవేశపడొద్దని బాబు వారికి తెలిపారు.
వేదిక మారింది కానీ ఆయన వర్కింగ్ స్టయిల్ మారలేదు. ఇదివరకు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా హంగామా చేసేవాడు. ఇపుడు ఫేస్‌బుక్‌లో. ట్విట్టర్ మీద అలక వహించి ఫేస్‌బుక్‌లోకి వచ్చాడు. రామ్‌గోపాల్ వర్మకిపుడు ఒకే ఒక్క వ్యాపకం: ఎన్టీఆర్ సినిమా గురించి అప్‌డేట్ చేయడం, టీవీ ఛానెల్స్‌లో మాట్లాడడం.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ రీసెంట్‌గా ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుని కూడా ఫిక్స్ చేశాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంగా ఈ కథ సాగుతుందట.
ఫైర్‌బ్రాండ్ రోజా ఊహాగానాలకి తెరదించింది. వర్మ తీసే "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాలో అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని ప్రకటించింది. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ తీస్తానని అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్‌రాజ్ అనీ, లక్ష్మీపార్వతిగా రోజా అని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే వర్మ అదంతా తూఛ్ అనేశాడు.
వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది పాత న్యూసే. మలబార్ తీరాన పుట్టిన ఈ కేరళ కుట్టి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో హల్‌చల్ చేయనుంది. త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేరకముందే...ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చరిత్రని తీస్తున్నా అని వర్మ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు తెగ వర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వనాథ్ స్పందించింది.