ఆర్జీవీ గీత దాట‌లేదు: క‌ల‌ర్స్ స్వాతి

Ram Gopal Varma has never crossed a line, says Swathi Reddy
Tuesday, November 28, 2017 - 16:00

రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్లు, ఆయ‌న మాట‌లు చూసి జ‌నాలు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు. ఆయ‌నకి ఆడ‌వాళ్ల పిచ్చి అని ఒక ఇమేజ్ ప‌డిపోయింది. కానీ ఇన్నేళ్ల కెరియ‌ర్‌లో ఏ హీరోయిన్ కూడా వ‌ర్మ గురించి చెడుగా మాట్లాడ‌లేదు. ఆర్జీవీ అడ్డ‌గోలుగా మాట్లాడిన‌ట్లు అనిపించినా..వ్య‌క్తిగా హి ఈజ్ జెంటిల్‌మెన్‌. ఆ విష‌యాన్ని హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి కూడా ధృవీక‌రించింది.

హాస్య‌ నటుడు ఆలీ నిర్వ‌హిస్తోన్న టీవీ షోలో క‌ల‌ర్స్ స్వాతి బోలేడ‌న్నీ విష‌యాలు చెప్పుకొచ్చింది. అందులో వ‌ర్మ గురించి చేసిన కామెంట్ ఆస‌క్తిక‌రం. ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంది ఆమె మాట‌.

వ‌ర్మ సినిమాల్లో న‌టించారు క‌దా ఆ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి అని ఆలీ అడిగితే ఆమె ఇచ్చిన స‌మాధానం ఇది:  "నేను ఇప్ప‌టివ‌రకు చేసిన ద‌ర్శ‌కుల్లో ఎలాంటి ఇబ్బందిపెట్ట‌ని గొప్ప ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌. న‌న్ను ఆయ‌న రేవ‌తితో పోల్చారు. న‌ట‌న విష‌యంలో ఎక్కువ థింక్ చేయ‌కుండా నేచుర‌ల్‌గా యాక్ట్ చేయ‌మ‌ని స‌లహా చెప్పారు. ఆయన తన గీతనెప్పుడూ దాటలేదు. హి ఈజ్ జెంటిల్మెన్‌."

సునీల్ హీరోగా రాంగోపాల్ వ‌ర్మ తీసిన అప్పల్రాజు సినిమాలో క‌ల‌ర్స్ స్వాతి హీరోయిన్‌. ఆ మూవీ ఆడ‌లేదు.