"లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని తిరుపతిలో గ్రాండ్‌గా అనౌన్స్ చేశాడు రాంగోపాల్ వర్మ. జనవరి 24న సినిమాని రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. అంటే కేవలం మూడు నెలల్లో సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ పాత్రని ఎవరు పోషిస్తారు, లక్ష్మీ పార్వతిగా ఎవరు నటిస్తారు అన్న విషయాన్ని బయటపెట్టలేదు.