ఒక సినిమాలో దేవినేని నెహ్రు. మరో సినిమాలో వైఎస్సార్. ఇపుడు చంద్రబాబు నాయుడు. ఒకే నటుడు..ఇలా ముగ్గురు రాజకీయ నేతల పాత్రల్లో. శ్రీతేజ్ అనే యువ నటుడు ఇపుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబునాయుడు పాత్ర పోషించనున్నాడు. ఈ ఫోటోలను వర్మ విడుదల చేశాడు.
ఈ నటుడు ఇంతకుముందు వర్మ తీసిన వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించాడు. అలాగే తాజాగా క్రిష్ తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో డాక్టర్ వైఎస్సార్‌గా కనిపించాడు. మూడు పాత్రల్లోనూ ఆయా వ్యక్తుల పోలీకలను రాబట్టడం నిజంగానే విశేషమే.
ఒకపుడు నాగబాబుని యమా ట్రోలింగ్ చేశారు ఆర్జీవీ. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ నీడలో బతికే వ్యక్తి అన్నట్లుగా మాట్లాడాడు వర్మ. సొంతంగా ఇమేజ్ లేని నాగబాబు నా గురించి కామెంట్ చేయడం ఏంటని వర్మ ఓ రేంజ్‌లో నాగబాబుని సోషల్ మీడియాలో ఆడుకున్నాడు.
క్యాలెండర్లు మారాయి. ఈక్వేషన్స్ ఛేంజ్ అయ్యాయి. ఇపుడు నాగబాబు బాలయ్యని టార్గెట్ చేస్తూ వీడియో కౌంటర్లు ఇస్తున్నాడు. దాంతో సీన్‌లోకి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. నాగబాబు గట్స్‌ని చూసి అసూయపడుతున్నానని అంటున్నాడు వర్మ
రాంగోపాల్ వర్మ ఎపుడు ఎవరిని పొగుడుతాడో అర్థం కాదు. ఐతే ఆయన ఎవరిని పొగిడినా..దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆయన వ్యూహాలు లేట్‌గా అర్థం అవుతాయి. రీసెంట్‌గా ఆయన తరుచుగా కంగన రనౌత్‌ని తెగ ప్రశంసిస్తున్నాడు. మణికర్ణిక టీజర్ వచ్చినపుడు ఈ టీజర్ 2.000 టైమ్స్ అదిరిందని పొగిడాడు.