నాగబాబుని చూస్తే వర్మకి జెలసీనట
ఒకపుడు నాగబాబుని యమా ట్రోలింగ్ చేశారు ఆర్జీవీ. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ నీడలో బతికే వ్యక్తి అన్నట్లుగా మాట్లాడాడు వర్మ. సొంతంగా ఇమేజ్ లేని నాగబాబు నా గురించి కామెంట్ చేయడం ఏంటని వర్మ ఓ రేంజ్‌లో నాగబాబుని సోషల్ మీడియాలో ఆడుకున్నాడు.
క్యాలెండర్లు మారాయి. ఈక్వేషన్స్ ఛేంజ్ అయ్యాయి. ఇపుడు నాగబాబు బాలయ్యని టార్గెట్ చేస్తూ వీడియో కౌంటర్లు ఇస్తున్నాడు. దాంతో సీన్‌లోకి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. నాగబాబు గట్స్‌ని చూసి అసూయపడుతున్నానని అంటున్నాడు వర్మ
"కామెంట్లు చేయడంలో నన్ను మించిపోయారనే బాధ ఒకవైపు ఉంది..మరోవైపు తన స్టార్ బ్రదర్స్‌ను సమర్థించడంలో సూపర్‌స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు ఉంది.. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు. నాగబాబు గారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం," అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఇది పొగడ్తనా? త తిట్టా అంటూ యథావిధిగా నెట్‌జనులు డిష్కషన్ మొదలుపెట్టారు.
- Log in to post comments