మైండ్ పోయింది, జ్యూసుంది: వ‌ర్మ

I have lost mind but have creative juices, says Ram Gopal Varma
Monday, November 20, 2017 - 14:45

రాంగోపాల్ వ‌ర్మ గొప్ప ద‌ర్శ‌కుడు (అఫ్‌కోర్స్‌ గిట్ట‌నివాళ్లు అది ఒక‌ప్పటి మాట‌ అని అంటారు). ఇపుడు వ‌ర్మ‌ తీస్తున్న సినిమాలు గొప్ప ద‌ర్శ‌కుడు అన్న ట్యాగ్‌కి ఏ మాత్రం న‌ప్ప‌వు అని ఆయ‌న‌ అభిమానులు కూడా ఒప్పుకుంటారు. అయితే ఎంత వ‌ర‌స్ట్ మూవీలో అయినా ఆయ‌న తీసే సినిమాల్లో ఏదో ఒక ప్ర‌యోగం ఉంటుంది. ఫిల్మ్ ల‌వ‌ర్స్‌కి ప‌నికొచ్చే టెక్నిక్ ఉంటుంది.

ఎటొచ్చి స‌మ‌స్య అంతా..ఆయ‌న ఫేస్‌బుక్ (ఒక‌పుడు ట్విట్ట‌ర్‌) పోస్ట్‌ల‌తోనే. ఏ పూట ఏ పోస్ట్ చేస్తాడో ఎవ‌రికీ అర్థం కాదు. కొన్ని అర్థ‌వంతంగా ఉంటాయి. కొన్ని అస‌హ్యంగా ఉంటాయి. అందుకే ఎబ్బెట్టుగా ఉండే పోస్ట్‌లు చూసిన‌పుడు, మాట‌లు విన్న‌ప్పుడు.. వ‌ర్మ‌కి మైండ్ పోయింది అని జ‌నం  నుంచి కామెంట్‌లు వ‌స్తూ ఉంటాయి. విచిత్రంగా వ‌ర్మ కూడా అదే మాట అంటున్నాడు త‌న‌కి మైండ్ దొబ్బిందని. మైండ్ పోయింది కానీ కండీష‌న్లు అప్ల‌యి అంటున్నాడు.

"నాకు మైండ్ దొబ్బిందనేది నిజం. జ్యూస్ అయిపోయిందా లేదా అనేది ఈ చిత్రం తర్వాత చూస్తారు," అని మాట్లాడాడు.

సోమ‌వారం ఉద‌యం (న‌వంబ‌ర్ 20) నాగార్జున హీరోగా వ‌ర్మ త‌న ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా మొద‌లుపెట్టాడు. అక్క‌డ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. జ్యూస్ అంటే క్రియేటివ్ ఆలోచ‌న‌ల ప్ర‌వాహం అన్న‌మాట‌.