వ‌ర్మని లైట్ తీస్కోండి: సీఎం బాబు

Don't take RGV seriously, Naidu tells partymen
Tuesday, October 17, 2017 - 16:00

రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" గురించి తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి మంగ‌ళ‌వారం వివ‌రించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడ‌నీ, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాల‌నీ వ‌ర్మ‌తో ఈ సినిమా తీయిస్తున్నార‌ని పార్టీ నేత‌లు ఆయ‌న‌కి తెలిపారు. ఐతే ఈ సినిమా విష‌యంలో అతిగా ఆవేశ‌ప‌డొద్ద‌ని పార్టీ నేత‌ల‌కి సూచించారు. వ‌ర్మ సినిమాకి పెద్ద ప్ర‌జాద‌ర‌ణ ఉండ‌ద‌న్నారు సీఎం.

జ‌నం ప‌ట్టించుకోని సినిమాల గురించి మీరు ఆవేశ‌ప‌డొద్ద‌ని బాబు వారికి తెలిపారు.

"సినిమాపై తెదేపా నేతలెవరూ ఇష్టానుసారం మాట్లాడొద్దు. ఎన్టీఆర్‌ మహాపురుషుడు, చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఎన్టీఆర్‌ ఏమిటో, రాష్ట్రంలోని జరిగిన పరిణామాలేంటో అందరికి తెలుసు. జరిగిన పరిణామాలకు విరుద్ధంగా ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలు హర్షించరు," అని సీఎం చంద్ర‌బాబు నాయుడు వారికి క్లారిటీ ఇచ్చారు.