కెరీర్ లో అందరూ తప్పులు చేస్తారు. కొందరు చెప్పుకుంటారు. మరికొందరు చెప్పుకోరు. రాజ్ తరుణ్ కూడా తను చేసిన తప్పుల గురించి ఇప్పటివరకు బయటకు చెప్పలేదు. కానీ అతడి మేనేజర్ రాజా రవీంద్ర మాత్రం చాలా విషయాలు బయటపెట్టేశాడు.
చాన్నాళ్ల కిందటే ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దిల్ రాజు బ్యానర్‌పై ఆ సినిమా చేయాలనేది ఒప్పందం. అంతా ఓకే అయింది. కథ సెట్ అయింది. నానితో పాటు దుల్కర్ సల్మాన్ కావాలని అనుకున్నారు. దుల్కర్ డేట్స్ లేవని చెప్పాడు. ఆ తర్వాత మరో పెద్ద హీరో కావాలని ఇంద్రగంటి కోరాడు. కానీ దిల్ రాజు మాత్రం ధైర్యం చేయలేకపోయాడు. ఈమధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ లో సేఫ్ వెంచర్స్ తీస్తున్న ఈ నిర్మాత.. ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేయడానికి కాస్త వెనకంజ వేశాడు.
సినిమాల్లేకపోతే ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సినీజనాల దగ్గర కొన్ని స్టాక్ ఆన్సర్స్ ఉంటాయి. కొత్త కథలు వింటున్నానని కొందరు చెబుతారు. సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి, త్వరలోనే చెబుతానంటారు మరికొందరు హీరోలు. అయితే రాజ్ తరుణ్ మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. సినిమాల్లేకపోతే మా ఇంట్లో కుక్కలతో ఆడుకుంటానంటున్నాడు ఈ లవర్ బాయ్.
దిల్‌రాజు బ్యానర్‌కి ఒక నేమ్ ఉంది. ఆయన సినిమాలకి మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. ఐతే ఈ మధ్య దిల్‌రాజు నేల మీద నిలవడం లేదు. ఎలాంటి సినిమానైనా హిట్ చేయగలం, ఓపెనింగ్ తీసుకురాగలమని అతి విశ్వాసంతో ఉన్నారు. అందుకే భూమ్మీదకి తీసుకురావాలని గట్టి షాక్ ఇచ్చినట్లున్నారు జనం.
లవర్... దిల్‌రాజు బ్యానర్ సినిమా కదా అని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఉదయం 8.45 షోలను రెండు థియేటర్లలో వేశారు. రెండు థియేటర్లకి వచ్చిన జనంని ఒక థియేటర్లో సర్దినా.. ఇంకా 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆ రేంజ్‌లో వచ్చారు జనం లవర్ చిత్రానికి మొదటి రోజు.