రాజ్ తరుణ్ చేసిన తప్పులివే

Raj Tarun did these mistakes, says Raja Ravindra
Saturday, August 17, 2019 - 10:30

కెరీర్ లో అందరూ తప్పులు చేస్తారు. కొందరు చెప్పుకుంటారు. మరికొందరు చెప్పుకోరు. రాజ్ తరుణ్ కూడా తను చేసిన తప్పుల గురించి ఇప్పటివరకు బయటకు చెప్పలేదు. కానీ అతడి మేనేజర్ రాజా రవీంద్ర మాత్రం చాలా విషయాలు బయటపెట్టేశాడు.

"రాజ్ తరుణ్ కు నచ్చిన కొన్ని కథలు నాకు నచ్చక వద్దన్నాను. అలాగే నాకు నచ్చిన కొన్ని కథల్ని కూడా రాజ్ తరుణ్ రిజెక్ట్ చేశాడు. వరుసగా సినిమాలు చేయడం వల్ల మేం జడ్జిమెంట్ మిస్ అయ్యాం. కథ నచ్చలేదని టాక్సీవాలా వదిలేశాడు. అది సూపర్ హిట్ అయింది. మారుతి చెప్పిన రాజుగాడు అనే కథ బాగుందని చేశాం. కానీ అది డిజాస్టర్ అయింది. శతమానం భవతి కూడా వదిలేశాం."

సినిమాలు వదిలేసినందుకు బాధలేదంటున్నాడు రాజారవీంద్ర. టాక్సీవాలా, శతమానంభవతి సినిమాలు రాజ్ తరుణ్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతాయని చెప్పలేమన్నాడు. ఆ విషయానికొస్తే కథ కూడా వినకుండా చేసిన కుమారి 21 ఎఫ్ హిట్ అయిందని చెప్పుకొచ్చాడు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.