Telangana Assembly Polls 2018

విజ‌య‌శాంతి పోటీ చేయ‌క త‌ప్ప‌దా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ఇంత‌కుముందు చెప్పింది రాముల‌మ్మ‌. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విజ‌య‌శాంతి ఈ సారి ఎన్నిక‌ల ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం అవుతాన‌ని ప్ర‌క‌టించింది. ఎంపీ ఎన్నిక‌ల‌పై క‌న్నేసిన ఆమె ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి దూరం ఉండాల‌నుకొంది. ఐతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమెని రంగంలోకి దింపాల‌నుకుంటోంది. 

దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెని పోటీ చేయ‌మ‌ని కోరుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్ప‌టికే ఆమె పేరుని ఈ సీట్‌కి ఖ‌రారు చేశార‌ని, త్వ‌ర‌లోనే తొలి జాబితా ప్ర‌క‌ట‌న‌లో ఆమె పేరు ఉంటుంద‌ని మీడియా రిపోర్ట్స్ చెపుతున్నాయి.

తెలంగాణ ఎన్నిక‌ల్లో నిర్మాత‌లు!

ఈ సారి తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో కొంత‌మంది సినిమా వాళ్లు నిలవ‌నున్నారు. టీఆర్ ఎస్‌ని వీడి బాబూమోహ‌న్ బీజేపీలో చేరాడు. ఈ తాజా మాజీ ఎమ్మెల్యే త‌దుప‌రి ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడో చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు ఇద్ద‌రు ముగ్గురు సినిమా వాళ్లు ఉవ్విళూరుతున్నారు. అందులో సీటు దాదాపుగా క‌న్‌ఫ‌మ్ అయిన వ్య‌క్తి... నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్‌. ఆయ‌న శేరిలింగంప‌ల్లి (హైద‌రాబాద్‌) నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ప‌క్కా అని తెలుస్తోంది.

బండ్ల గ‌ణేష్‌...ఓ కామెడీ పీస్‌!

హెడ్డింగ్ చాలా హార్ష్‌గా ఉంది క‌దూ. అవును. కానీ ఈ మాట మేమంటున్న‌ది కాదు. తెలంగాణ‌వాదులు, తెలంగాణ ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియాలో బండ్ల గ‌ణేష్‌ని ఇలా ట్రాల్ చేస్తున్నారు. షాద్‌న‌గ‌ర్‌కి చెందిన బండ్ల గ‌ణేష్ కోళ్ల ఫార‌మ్ వ్యాపారంలో కోట్లు గ‌డించాడు. ఆ త‌ర్వాత నిర్మాత‌గా కూడా రాణించాడు. ఇపుడు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాడు. కాంగ్రెస్ త‌ర‌ఫున వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 

Vijayashanti not to contest Assembly polls

వాళ్ల‌ని టెన్స‌న్‌ పెడుతోన్న‌ ప‌వ‌ర్‌స్టార్‌

తెలంగాణ ఎన్నిక‌లకి నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే వ‌స్తుంద‌నేది అంచ‌నా. అందుకే ముందే పొత్తులు కుదుర్చుకునేందుకు అన్ని పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. పాల‌క పార్టీ టీఆర్ఎస్‌ని ఢీకొట్టాలంటే కూట‌మిగా కూడా క‌ష్ట‌మే కానీ క‌నీసం పొత్తులు లేక‌పోతే ముందు చేతులెత్తెసిన‌ట్లు అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వ్య‌తిర‌కం అని చెప్పిన సీపీఎం పార్టీ ప‌వ‌ర్‌స్టార్ తో పొత్త కొసం తెగ ట్రై చేస్తోంది.

Subscribe to RSS - Telangana Assembly Polls 2018