బండ్ల గణేష్...ఓ కామెడీ పీస్!

హెడ్డింగ్ చాలా హార్ష్‌గా ఉంది కదూ. అవును. కానీ ఈ మాట మేమంటున్నది కాదు. తెలంగాణవాదులు, తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌ని ఇలా ట్రాల్ చేస్తున్నారు. షాద్‌నగర్‌కి చెందిన బండ్ల గణేష్ కోళ్ల ఫారమ్ వ్యాపారంలో కోట్లు గడించాడు. ఆ తర్వాత నిర్మాతగా కూడా రాణించాడు. ఇపుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కాంగ్రెస్ తరఫున వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ మాజీ కమెడియన్‌ని ఇపుడు కామెడీ పీస్‌గా వెక్కిరేంచేందుకు కారణం..అతని రీసెంట్ ఇంటర్వ్యూ. జర్నలిస్ట్ మూర్తితో బండ్ల గణేష్ చేసిన చిట్‌చాట్ ఒక ప్రహసనంలా సాగింది.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ని దేవుడు అని చెప్పుకున్న మీరు జనసేనలో ఎందుకు చేరలేదు అని అడిగితే..అది నా పర్సనల్ విషయం అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు పర్సనల్ విషయాలు అడిగితే స్టూడియో నుంచి వాకౌట్ చేస్తానని వడివడిగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. దాంతో జర్నలిస్ట్ మూర్తి ఆయన షర్ట్ పట్టుకొని లాగి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు. ఇది కామెడీ నెంబర్ వన్.
ఇంకోటి ఏంటంటే..ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే గణేష్ ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు. బండ్ల గణేష్ అనే నేను అంటూ మహేష్‌బాబు భరత్ అనే నేను సినిమాలో డైలాగ్ చెప్పిన రేంజ్‌లో టీవీ స్టూడియోలోనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేశాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఆల్రెడీ కన్‌ఫమ్ అయిందట. తెలంగాణ స్టేట్‌లో తాను ఎక్కడ నిలబడ్డా ఈజీగా గెలిచేస్తాడట. ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఉండడం తప్పులేదు కానీ టీవీ స్టూడియోలోనే బండ్ల గణేష్ నేను అంటూ సినిమాటిక్ ప్రమాణ స్వీకరాలు ఓకరాలు (వాంతి) వచ్చేలా చేస్తున్నాయి. ఇది కామెడీ నెంబర్ టూ.
ఇవి చూసే అతన్ని ఇపుడు కామెడీ పీస్ అంటూ ట్రాల్ చేస్తున్నారంతా. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా హాస్య గుళికలున్నాయట.
- Log in to post comments