విజయశాంతి పోటీ చేయక తప్పదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఇంతకుముందు చెప్పింది రాములమ్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి ఈ సారి ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని ప్రకటించింది. ఎంపీ ఎన్నికలపై కన్నేసిన ఆమె ఈసారి అసెంబ్లీ ఎన్నికలకి దూరం ఉండాలనుకొంది. ఐతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమెని రంగంలోకి దింపాలనుకుంటోంది.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెని పోటీ చేయమని కోరుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఆమె పేరుని ఈ సీట్‌కి ఖరారు చేశారని, త్వరలోనే తొలి జాబితా ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని మీడియా రిపోర్ట్స్ చెపుతున్నాయి.
కేసీఆర్ సొంత ప్రాంతమైన దుబ్బాకలో టీఆర్ ఎస్‌ని ఓడించాలంటే విజయశాంతిలాంటి గ్లామర్ తార కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలనుకుంటోంది. మరి విజయశాంతి నిజంగానే ఎన్నికల పోటీలోకి దిగుతుందా అనేది చూడాలి.
- Log in to post comments