తండ్రి నాగబాబు తరపున యువ హీరో వరుణ్ తేజ్ ప్రచారం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు నాగబాబు. తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ తరఫున బరిలో ఉన్నారు నాగబాబు.
కొత్త సినిమా కోసం బాక్సింగ్లో ట్రయినింగ్ తీసుకునేందుకు ఇటీవల అమెరికా వెళ్లాడు వరుణ్ తేజ్. ఈ నెల 9న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో తిరిగి ఇండియాకి వచ్చిన వరుణ్ తేజ ఉగాది నాడు...క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. తన తండ్రిని నర్సాపురంలో, తన బాబాయిని భీమవరంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు వరుణ్ తేజ్.
రచయిత, నిర్మాత కోన వెంకట్ ఒకప్పుడు పవన్ కల్యాణ్ నిత్యం పొగుడుతూ ఉండేవారు. నిత్యం ట్విట్టర్‌లో అదే రాస్తుండేవారు. పవన్ కల్యాణ్ నా సోల్‌మేట్ అని అంటుండేవారు. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా కోనని కూడా బాగా అభిమానిస్తూ వచ్చారు. ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ఐతే పవన్ కల్యాణ్ పై ఇటీవల కోన వెంకట్ సునిశిత విమర్శలు చేశారు. కోన వెంకట్ బాబాయ్ కోన రఘుపతి, కోన వెంకట్ బావ ద్రోణంరాజు శ్రీనివాస్, కోన వెంకట్ ప్రొడ్యుసర్ మిత్రుడు ఎంవీవీ సత్యనారయణ.....ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్పీ తరఫున పోటీలో ఉన్నారు.
"తెలంగాణా.. పాకిస్థానా "అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా ఘాటుగా రియాక్టయ్యారు. ఓట్ల కోసం పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడడం సబబు కాదని హితవు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రావారికి ఎవరికీ భయం లేదు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దు అని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా భీమవరంలో ఆవేశపూరితంగా చేసిన స్పీచ్ విమర్శలకి గురైంది. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారన్నట్లుగా మాట్లాడడం కలకలం రేపింది. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కానీ అది కన్వే అయింది మాత్రం తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారనేది.
"మనం (ఆంధ్రా ప్రాంతం ప్రజలు) ఇక్కడ ఈ కులం, ఆ కులం అని చెప్పుకొని మనల్ని మనం విడదీసుకుంటున్నాం. మనం కులాల వారిగా విడిపోతున్నాం. కానీ తెలంగాణ వాళ్లకి మనం దళితులైనా, వైశ్యులైనా, మరో కులం వారైనా..వారందరికీ మనం ఆంధ్రావారిమే. మనల్ని అక్కడ కొడుతున్నారు." ఇలా స్పీచ్ ఇచ్చాడు.