నర్సాపురంలో వరుణ్ తేజ ప్రచారం

Varun Tej campaigns in Narsapuram
Saturday, April 6, 2019 - 17:15

తండ్రి నాగబాబు తరపున యువ హీరో వరుణ్ తేజ్ ప్రచారం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు నాగబాబు. తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ తరఫున బరిలో ఉన్నారు నాగబాబు.

కొత్త సినిమా కోసం బాక్సింగ్లో ట్రయినింగ్ తీసుకునేందుకు ఇటీవల అమెరికా వెళ్లాడు వరుణ్ తేజ్. ఈ నెల 9న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో తిరిగి ఇండియాకి వచ్చిన వరుణ్ తేజ ఉగాది నాడు...క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. తన తండ్రిని నర్సాపురంలో, తన బాబాయిని భీమవరంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు వరుణ్ తేజ్.

ఇప్పటికే నాగబాబు కూతురు నీహారిక ఒక రోజు నియోజకవర్గంలో ప్రచారం చేసింది. ఇపుడు కుమారుడు వరుణ్ తేజ్ వచ్చాడు. వరుణ్ తేజ్ చూసేందుకు జనం ఎగబడ్డారు.