పవన్ కల్యాణ్‌కి పోసాని కౌంటర్

"తెలంగాణా.. పాకిస్థానా "అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా ఘాటుగా రియాక్టయ్యారు. ఓట్ల కోసం పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడడం సబబు కాదని హితవు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రావారికి ఎవరికీ భయం లేదు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దు అని అన్నారు.
"తెలంగాణలో కేసీఆర్ భూమలు లాక్కుంటున్నారని అన్నావు. మరి ఎందుకు కేసీఆర్‌తో కిలా కిలా నవ్వుతూ ఫోటోలు దిగావు. కేసీఆర్ బెస్ట్ సీఎం..ఆయన పాలసీలను చూసి నేర్చుకోవాలని కొన్ని నెలల క్రితమే ఎందుకు అన్నావు? ఎందుకు కేటీఆర్, కవితలతో రెగ్యులర్‌గా విషెష్ చెపుకుంటూ హడావుడి చేస్తావు. పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుందాం.. ఆంధ్రావాళ్లపై దాడి జరిగిందని అనుకుందాం. మరి నిజంగానే పౌరుషం ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణలో ఆంధ్రావాళ్లపై దాడి చేసినపుడు ఏమి చేశాడంట. బాధితులను వారి ఇంటికెళ్లి పరామర్శించాడా? ఆ దాడులు జరిగాయని చెపుతున్న టైమ్‌లో పవన్ కల్యాణ్ తన ఫామ్‌హౌస్ నుంచి బయటికి వచ్చి కేసీఆర్ ఖబర్దార్ అని ఏమైనా బెదిరించాడా? ఓట్ల కోసమే కదా ఇదంతా," అంటూ పవన్ ల్యాణ్‌పై తనదైన శైలిలో పోసాని విరుచుక పడ్డారు.
జనసేన అధినేత ఓట్ల కోసం ప్రాంతాల మధ్య విధ్వేషాలు, రెచ్చగెట్టే ప్రసంగాలు చేయడం మానుకోవాలని చెప్పారు పోసాని.
- Log in to post comments