TDP

NTR Biopic: Congress to be replaced with Kendram!?

Allu Arjun's uncle to work for Mahakutami

తెలుగుదేశంలో చేరిన న‌టి రేవ‌తి!

రేవ‌తి అని హెడ్‌లైన్ చూసి... మౌన‌రాగం, గాయం, అంకురం చిత్రాల న‌టి అనుకోవ‌ద్దు. రేవ‌తి చౌద‌రి అనే వ‌ర్ధ‌మాన న‌టి గురించి ఈ ప్ర‌స్తావ‌న‌. శివాజీ హీరోగా రూపొందిన ఓ సినిమాలోనూ, తార‌క‌ర‌త్న స‌ర‌స‌న కాక‌తీయుడు చిత్రంలోనూ న‌టించింది రేవ‌తి చౌదరి. ఆమె పుట్టింది, పెరిగింది విజ‌య‌వాడ‌లోనే కానీ చాలా కాలంగా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నందున ఈ సారి తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరింది. అన్న‌ట్లు ఆమె న‌టించిన ఆ రెండూ సినిమాలు విడుద‌ల‌కి నోచుకోలేద‌ట‌!

హ‌రికృష్ణ‌....చైత‌న్య ర‌థ‌సార‌థి

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడిగా హ‌రికృష్ణ తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కి అత్యంత ప్రియ‌మైన వ్య‌క్తి. పాత త‌రం రాజ‌కీయ నాయ‌కులు.. ఆయన్ని చైత‌న్య ర‌థ‌సార‌థిగా అభిమానిస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ వ‌దిలి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ప‌ర్య‌టించారు. తెలుగుదేశం పార్టీ  ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైత‌న్య ర‌థం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బ‌స్సు స్టీరింగ్‌ని చేప‌ట్టింది ఎవ‌రో కాదు ఆయ‌న కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌నే.

సినిమా వాళ్లు ఉద్య‌మం చేస్తే మీరేం చేస్తారు?

త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం చేసిన‌పుడు అక్క‌డి సినిమా హీరోలంతా వ‌చ్చి మ‌ద్ద‌తిచ్చారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా ఉద్య‌మంలో పాల్గొన్నారు. మ‌రి తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ టాలీవుడ్ తార‌ల‌పై తీవ్రస్థాయిలో తెలుగు దేశం నాయ‌కుడు బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ విమర్శలు చేశారు. ఉద్యమించకపోతే ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు.

Pawan Kalyan gives final clarity on Paritala rumors

రోజా లేక‌పోతే కిక్కే లేద‌ట‌

రోజా లేక‌పోతే అస్స‌లు కిక్ లేద‌బ్బా! ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన మంత్ర‌లు, ఎమ్మెల్యేలు.

న‌టి రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్‌బ్రాండ్ నేత‌. ఆమె నోరు విప్పిందంటే ఎదుటి ప‌క్షం నేత‌లు మాట‌లు వెతుక్కోవాలి. ఆమె పొలిటిక‌ల్ పంచ్ డైలాగ్‌ల‌ బుల్లెట్‌ల‌ను త‌ట్టుకోవ‌డం ఎంత‌టి పురుష‌పుంగవుల‌కైనా క‌ష్ట‌మే. ఆమె నిర్మోహ‌మాటంగా మాట్లాడుతుంది. అవి బూతుల‌ని ఆడిపోసుకుంటారు అధికార ప‌క్ష నేత‌లు. కానీ నావి క‌ర్ణ‌క‌ఠోర స‌త్యాలు అంటూ ఉంటుంది రోజా.

రేవంత్ బాహుబ‌లి: రాంగోపాల్ వ‌ర్మ‌

సినిమాల‌కి సంబంధించిన విష‌యాలే కాదు తెలుగునాట కీల‌క‌మైన ప్ర‌తి రాజ‌కీయ ప‌రిణామంపై త‌న‌దైన శైలిలో పోస్ట్‌లు పెట్ట‌డం రాంగోపాల్ వ‌ర్మ శైలి. తాజాగా ఆయ‌న తెలంగాణ మాజీ టీడీపీ నాయ‌కుడు రేవంత్ రెడ్డిని బాహుబ‌లి అని డిక్లేర్ చేశాడు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి వ‌స్తాడ‌ని ఆ మ‌ధ్య కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ బాహుబ‌లి రేవంత్ రెడ్డి అని వర్మ ఫిక్స్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

వ‌ర్మని లైట్ తీస్కోండి: సీఎం బాబు

రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" గురించి తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి మంగ‌ళ‌వారం వివ‌రించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడ‌నీ, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాల‌నీ వ‌ర్మ‌తో ఈ సినిమా తీయిస్తున్నార‌ని పార్టీ నేత‌లు ఆయ‌న‌కి తెలిపారు. ఐతే ఈ సినిమా విష‌యంలో అతిగా ఆవేశ‌ప‌డొద్ద‌ని పార్టీ నేత‌ల‌కి సూచించారు. వ‌ర్మ సినిమాకి పెద్ద ప్ర‌జాద‌ర‌ణ ఉండ‌ద‌న్నారు సీఎం.

జ‌నం ప‌ట్టించుకోని సినిమాల గురించి మీరు ఆవేశ‌ప‌డొద్ద‌ని బాబు వారికి తెలిపారు.

వ‌ర్మ‌పై వాణీవిశ్వనాథ్ ఫైర్

వాణీ విశ్వ‌నాథ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నేది పాత న్యూసే. మ‌ల‌బార్‌ తీరాన‌ పుట్టిన ఈ కేర‌ళ కుట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిటిక్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేర‌క‌ముందే...ఆమె తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వ‌ర్మపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చ‌రిత్ర‌ని తీస్తున్నా అని వ‌ర్మ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం నేత‌లు తెగ వ‌ర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వ‌నాథ్ స్పందించింది.

Pages

Subscribe to RSS - TDP