తెలుగుదేశంలో చేరిన నటి రేవతి!

రేవతి అని హెడ్‌లైన్ చూసి... మౌనరాగం, గాయం, అంకురం చిత్రాల నటి అనుకోవద్దు. రేవతి చౌదరి అనే వర్ధమాన నటి గురించి ఈ ప్రస్తావన. శివాజీ హీరోగా రూపొందిన ఓ సినిమాలోనూ, తారకరత్న సరసన కాకతీయుడు చిత్రంలోనూ నటించింది రేవతి చౌదరి. ఆమె పుట్టింది, పెరిగింది విజయవాడలోనే కానీ చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నందున ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరింది. అన్నట్లు ఆమె నటించిన ఆ రెండూ సినిమాలు విడుదలకి నోచుకోలేదట!
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ఎన్నికలతో పోల్చితే తెలంగాణ ఎన్నికల్లో సినిమా తారల హడావుడి చాలా తక్కువ. కాంగ్రెస్ తరఫున రాములమ్మ ప్రచారం చేస్తున్నారు. బిజేపీ తరఫున తాజా మాజీ బాబుమోహన్ పోటీలో ఉన్నారు. కానీ ఆంధ్రలో ఉన్నట్లు పవన్ కల్యాణ్, బాలకృష్ణ స్థాయి స్టార్స్ ఎవరూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
సో..రేవతి వంటి చోటామోటా తారలు రాకతో అయినా కొంత గ్లామర్ తోడవుతుందనే చెప్పాలి.
- Log in to post comments