Telangana Elections 2018

Telangana Elections: Tollywood stars cast their votes

ఇక మ‌ళ్లీ షూటింగ్‌కి బాల‌య్య‌

నాలుగు రోజులుగా తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ళ్లీ గురువారం నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. ఈ రోజు (డిసెంబ‌ర్ 5) ఎన్నిక‌ల ప్రచారం ముగిసింది. బాల‌య్య చేసిన అనేక ఎన్నిక‌ల స్పీచ్‌లు వైర‌ల్‌గా మారాయి. కేసీఆర్‌పై విరుచుకు ప‌డడం, ఆంధ్రాకి రా అని స‌వాల్ విస‌ర‌డం చ‌ర్చకి దారితీశాయి. అలాగే ఉర్దూ లాంగ్వేజ్‌లోనూ స్పీచ్‌లు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఏ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌ని జ‌న‌సేనాని

తెలంగాణ ఎన్నిక‌ల్లో తెరాస‌కి అనుకూలంగా ఓటేయ్యాల్సిందిగా త‌న అభిమానుల‌ను, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరుతాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంతా భావించారు. కానీ జ‌న‌సేనాని మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడ‌లేదు. వ్య‌తిరేకంగానూ చెప్ప‌లేదు. ట్విట్ట‌ర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపాడు.

త‌క్కువ అవినీతి, పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందించే వారిని ఎన్నుకోమ‌ని కోరాడు. దాన్ని ఆయ‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఎలా అర్థం చేసుకుంటార‌నేది చూడాలి.

తెరాస‌కే ప‌వ‌ర్‌స్టార్ సపోర్ట్‌!

తెలంగాణ ఎన్నిక‌ల్లో అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుగుసినిమా.కామ్ ఇంత‌క‌ముందే వార్త‌ను ప్ర‌చురించింది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ సారాంశం అదే. 

తెలంగాణ‌కి షెడ్యూల్ క‌న్నా ముందే ఎన్నిక‌లు వ‌చ్చినందున ఈ సారి త‌మ పార్టీ పోటీ చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించాడు. ఇక తాజాగా ఆయ‌న త‌మ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల నుంచి అభిప్రాయాన్ని సేక‌రిస్తున్నాడు. 

కేసీఆర్‌.. ఆంధ్రాకి రా: బాల‌కృష్ణ‌

నంద‌మూరి బాల‌కృష్ణ తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం మొద‌లు పెట్టాడు. హైద‌రాబాద్‌లో తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న చోట క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. చంద్ర‌బాబు వ‌ద్దు అంటే ఎయిర్‌పోర్ట్, హైటెక్ సిటీ కూడా వ‌ద్ద‌నాలి అంటూ మొద‌టి రోజు ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన బాల‌య్య రెండో రోజు...తెలంగాణ సీఎం కేసీఆర్‌కి స‌వాల్ విసిరాడు.

ప్ర‌చారానికి జూనియ‌ర్ రావ‌డం లేదు

నంద‌మూరి సుహాసిని కోసం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారంలోకి దిగాడు. ఆమెతో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున మ‌రో రెండు రోజులు ప్ర‌చారం చేయనున్నాడు బాల‌య్య‌. ఐతే, సుహాసిని కోసం క‌ల్యాణ్‌రామ్‌, జూనియ‌ర్‌లో చివ‌రి నిమిషంలో రంగంలోకి దిగుతార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు టాక్ న‌డిచింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రూ ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

రాముల‌మ్మ‌కి పిక్చ‌ర్ అర్థ‌మైందా?

విజ‌య‌శాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయ‌న‌ర్‌గా ప్ర‌చార రంగంలోకి దిగారు. తెలంగాణ‌లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు కానీ ఆమెకి ప్ర‌చారం ద‌క్క‌డం లేదు. జ‌న‌ర‌ల్‌గా స్టార్ క్యాంపెయ‌న‌ర్ల ప్ర‌చారానికి మీడియా ఎక్కువ క‌వ‌రేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ రాముల‌మ్మ ప్ర‌చారానికి మీడియాలో పెద్ద‌గా చోటు ద‌క్క‌డం లేదు. 

Balakrishna's election campaign schedule announced

ఇక జూనియ‌ర్‌కి త‌ప్ప‌ట్లేదు!

నారా చంద్ర‌బాబు నాయుడు ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి, ఆ పార్టీ క‌లాపాలకి గ‌త కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఈ సారి ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దించాల‌ని వ్యూహం ప‌న్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు. క‌ల్యాణ్‌రామ్ కుటుంబంలో ఒక‌రికి టికెట్ వ‌స్తే జూనియ‌ర్ త‌న బెట్టుని గ‌ట్టు మీద పెట్ట‌క త‌ప్ప‌ద‌ని బాబుకి తెలుసు. తాజా స‌మాచారం ప్రకారం.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారం చేసేందుకు అంగీక‌రించాడ‌ట‌. అంటే బాబు ప్లాన్ ఫ‌లించింది.

Prakash Raj lends support to TRS

Pages

Subscribe to RSS - Telangana Elections 2018