ఏ పార్టీకి మద్దతు తెలపని జనసేనాని

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకి అనుకూలంగా ఓటేయ్యాల్సిందిగా తన అభిమానులను, జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ కోరుతాడని రాజకీయ విశ్లేషకులు అంతా భావించారు. కానీ జనసేనాని మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగానూ చెప్పలేదు. ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపాడు.
తక్కువ అవినీతి, పారదర్శకమైన పాలన అందించే వారిని ఎన్నుకోమని కోరాడు. దాన్ని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రసంగాలు చేస్తున్న పవర్‌స్టార్ ఇక్కడ మహాకూటమికి ఓటెయ్యాల్సిందిగా ఎలాగూ చెప్పలేడు. అలాగే తెరాసకి అనుకూలంగా మాట్లాడితే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుందని పవర్‌స్టార్ సంకోంచినట్లు కనిపిస్తోంది.
మొత్తమ్మీద, పవర్‌స్టార్ తన వీడియో సందేశంతో ఎలాంటి సంచలనాలను నమోదు చేయలేదు.
— Pawan Kalyan (@PawanKalyan) December 5, 2018
- Log in to post comments