కేసీఆర్.. ఆంధ్రాకి రా: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం మొదలు పెట్టాడు. హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు వద్దు అంటే ఎయిర్‌పోర్ట్, హైటెక్ సిటీ కూడా వద్దనాలి అంటూ మొదటి రోజు ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన బాలయ్య రెండో రోజు...తెలంగాణ సీఎం కేసీఆర్‌కి సవాల్ విసిరాడు.
‘ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానన్నావు కదా.. ఏపీకి రా చూసుకుందాం’ అంటూ తెరాస అధినేతకి బాలయ్య ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ ఎన్నికల్లో కాళ్ళు, వేళ్లు పెడుతున్న చంద్రబాబుని ఇరుకున పెట్టేందుకు మేం ఆంధ్రాల కూడా వేలు పెడుతామని ఇటీవల తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దానికి స్పందనగా బాలయ్య కేసీఆర్‌కి సవాల్ విసిరారు. మరి కేసీఆర్ బాలయ్యకి ఏమి సమాధానం ఇస్తారో చూడాలి.
ప్రచారానికి ఇంకా రెండు రోజుల టైమ్ ఉంది. బాలయ్య రేపు (మంగళవారం) కూకట్‌పల్లి, బోయనపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తారట.
మరోవైపు, "కేసీఆర్‌ది లాటరీ, చంద్రబాబుది హిస్టరీ" అని బాలయ్య విమర్శించడంతో టీఆర్ఎస్ శ్రేణుల సోషల్ మీడియాలో బాలయ్యని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ది చరిత్ర ఎలా కాదో బాలయ్యకే తెలియాలి అంటూ మండిపడుతున్నారు. లాటరీ అంటే చంద్రబాబుది, ఏ టైమ్‌కి ఏ పార్టీ గాలి వీచితే ఆ పార్టీతో పొత్తు పొట్టుకొని గట్టేక్కే చంద్రబాబు లాటరీ సీఎం అంటూ వారు తమదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబం, వంశం అంటూ పడికట్టు సినిమా డైలాగ్‌లు మీ ఆంధ్రాలో చెప్పుకో..తెలంగాణలో ఈ సొల్లును ఎవరూ వినరంటూ గట్టిగానే బాలయ్యపై విరుచుకుపడుతున్నారు తెరాస శ్రేణులు.
- Log in to post comments