భార్యతో కలిసి రామ్‌చరణ్ పూజలు చేసిందెందుకు?

రామ్‌చరణ్ జనరల్‌గా సోలోగానే ఔట్‌డోర్ షూటింగ్‌ల్లో పాల్గొంటాడు. ఫారిన్ లొకేషన్స్‌కి వెళ్లినపుడే భార్యని తీసుకెళ్తాడు. కానీ ఈ సారి ఆయన భార్య ఉపాసానని కోస్తాంధ్రకి తీసుకెళ్లాడు. చరణ్‌తో కలిసి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఉపాసన. అక్కడి నేచర్‌ని, కోస్తా ప్రాంత అందాలను ఇద్దరూ వీక్షిస్తూ మరో హనీమూన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది అని సరదా కామెంట్‌లు పడుతున్నాయి. ఆ రేంజ్‌లో వారు అక్కడ హల్‌చల్ చేస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం కొల్లేటి సరస్సు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షూటింగ్ గ్యాప్‌లో చరణ్, ఉపాసాన చాలా హంగామా చేస్తున్నారు.
చరణ్ కూడా తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి ఒక సాదాసీదా భర్తలా భార్యని వెంటబెట్టుకొని అక్కడి అందమైన ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. అంతేకాదు, స్థానిక గుళ్లల్లో పూజలు చేస్తున్నాడు. భీమవరం నగరంలోని ఫేమస్ మావుళ్లమ్మ టెంపుల్‌లో బుధవారం (ఏప్రిల్ 19) చరణ్, ఉపాసాన ప్రత్యేక పూజలు చేశారు. వీరి పూజలు సాధారణ పూజలే. మావుళ్లమ్మ దేవాలయాని సందర్శించుకోవాలన్న ఉపాసాన కోరిక ప్రకారం చరణ్ ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడంతే.
మెగాస్టార్ చిరంజీవి చిన్నపుడు ఈ పరిసర ప్రాంతాల్లోనే పెరిగారు. చిరంజీవి పుట్టి, పెరిగిన మొగల్తూరు గ్రామం భీమవరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సో ఆ విధంగా చరణ్‌కి, ఉపాసానకిది స్పెషల్ టూర్.
- Log in to post comments