సమంత బ్రాండ్ అంబాసిడ‌ర్ కాద‌ట‌!

Samantha not a brand ambassador
Wednesday, April 19, 2017 - 13:30

స‌మంత చాలా ఆనందంగా హ్యండ్‌లూమ్స్‌ని ప్ర‌మోట్ చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని కొన్ని గ్రామాల‌ను సంద‌ర్శించింది. చేనేత కార్మికుల వెత‌ల‌ను స్వ‌యంగా తెలుసుకొంది. ఇపుడు అస‌లు విష‌యం ఏంటంటే ఆమెని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం నియ‌మించ‌లేద‌న్న వార్త వచ్చింది. 

చిక్కా దేవదాసు అనే వ్య‌క్తి సమాచార హక్కు చట్టం కింద స‌మంతని నేత రాయబారిగా నియమించారా అన్న ప్ర‌శ్న వేశాడు. ఆయ‌న అడిగిన ప్రశ్నకు నో అనే రిప్ల‌యి ఇచ్చింది చేనేత‌, జౌళి శాఖ. స‌మంత‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మిస్తున్న‌ట్లు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం ఘ‌నంగా ప్ర‌క‌టించాడు. ఆమెకి స‌న్మానం కూడా చేశాడు. మ‌రి ఈ ట్విస్ట్ ఏంటో!