రాజ్‌త‌రుణ్ హీరోగా 'లవర్' ప్రారంభం

Raj Tharun's Lover launched
Tuesday, October 24, 2017 - 10:45

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. రాజ్‌త‌రుణ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో కొత్త సినిమా `లవర్` మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. `అలా ఎలా`వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత శ్యాంప్ర‌సాద్ రెడ్డి, సతీష్ వేగేశ్న స్క్రిప్ట్ అందించారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్ట‌గా, ఫైనాన్సియ‌ర్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో యాంగిల్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ  చిత్రంలో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న గాయ‌త్రి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వంబ‌ర్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్‌..ఎ.ఎస్‌.ప్ర‌కాష్ ఆర్ట్ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.