నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ భామ‌

Dimple Kapadia opposite Nagarjuna?
Wednesday, July 18, 2018 - 13:30

నాగార్జున త‌న లేట్ వ‌య‌సులో ఒక సీనియ‌ర్ హీరోయిన్‌తో న‌టించ‌నున్నాడు. నాగార్జున యంగ్‌గా ఉన్న‌పుడు డింపుల్ క‌పాడియా ఒక సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌. ఆమె ఇపుడు నాగ్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ట‌.

దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ్‌ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో బాలీవుడ్‌లో కొత్త ఇన్నింగ్స్ షురూ చేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ది స్పెష‌ల్ రోల్‌. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి డింపుల్‌ కపాడియా నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇందులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అమితాబ్‌కి ఎవ‌రూ జోడీ లేర‌ట‌. నాగ్ స‌ర‌స‌న మాత్రం 61 ఏళ్ల డింపుల్ న‌టించ‌నుంద‌ట‌. నాగార్జున ఈ సినిమాలో త‌న ఏజ్‌కి త‌గ్గ రోల్‌లోనే క‌నిపించ‌నున్నాడు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.