తేజస్వి విషయంలో భయపడ్డ బిగ్‌బాస్

సోషల్ మీడియా పవర్‌కి బిగ్‌బాస్ టీమ్ తలొగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది. బిగ్‌బాస్ 2 నుంచి పాపులర్ హీరోయిన్ తేజస్విని ఎలిమినేట్ అయింది. రెండో సీజన్ మొదటి రోజు నుంచి తేజస్వి చాలా అగ్రెసివ్‌గా ఉంటూ వచ్చింది. పలువురు కాంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడానికి ఆమెనే కారణం. తేజస్వి ఎన్ని తప్పులు చేసింది. ఐనా బిగ్‌బాస్ వెనకేసుకురావడం, నాని మందలించకపోవడంతో ఏదో గోల్మాల్ జరుగుతోందని ట్విట్టర్లో గోల గోల మొదలైంది.
స్టార్ మా, బిగ్‌బాస్ టీమ్ కలిసి తేజస్వి విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాంటెస్టెంట్లలో ఉన్న ఒక్క పాపులర్ హీరోయిన్ ఆమే కావడంతో...తేజస్వి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోవడం లేదనీ, ఆమెని చివరి వరకు పోటీలో ఉండేలా ప్రయత్నిస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి.
తేజస్విని బండబూతులు తిడుతూ నెటిజెన్స్ పోస్ట్‌లు పెట్టారు. ఆమె మీద బాగా రగడ జరగడం, సోషల్ మీడియాలో ప్రోగ్రామ్‌కి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండడంతో బిగ్‌బాస్ టీమ్ భయపడిందట. అందుకే తాము ఫెయిర్‌గా ఉన్నామని చెప్పుకోవడానికే ఈ వీకెండ్ ఆమెని ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఇంటికి వంపించేశారు.
సామ్రాట్, తేజస్వి..ఇద్దరిలో ఎవర్ని ఎలిమినేట్ చేయాలనే ప్రశ్న వచ్చినపుడు తేజస్వి వైపు మొగ్గు పడింది. అలా తేజస్వి ఇపుడు బిగ్‌బాస్ 2 నుంచి బయటికి వచ్చేసింది. ఆమె బయటికి రావడంతో ఇపుడు బిగ్‌బాస్ 2 టీమ్ మీద కామెంట్లు తగ్గాయి.
- Log in to post comments