నానికి నివేద లేఖ!

హీరోగా నాని పదో బర్త్‌డే జరుపుకుంటున్నాడు. నాని నటించిన తొలి చిత్రం.."అష్టాచెమ్మా" విడుదలై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లల్లో నాని ఎక్కడికో చేరుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. నేచురల్ స్టార్ అనే బిరుదు కూడా పొందాడు.
సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా స్వతహాగా పైకొచ్చిన అతికొద్దిమంది హీరోల్లో గంటా నాని ఒకరు. "భలే భలే మగాడివోయి"తో నాని దశ తిరిగింది. ఆ సినిమా నుంచి నిన్న మొన్నటి ఎం.సీ.ఏ వరకు నాన్‌స్టాప్‌గా హిట్స్ ఇచ్చాడు. త్వరలోనే "దేవదాసు"లోనూ మెప్పించనున్నాడు. బుల్లితెరపై బిగ్బాస్గానూ సందడి చేస్తున్నాడు. 10 ఏళ్లల్లో నాని విజయగాథ నిజంగా చాలామందికి స్ఫూర్తినిచ్చేదే.
ఐతే ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా రాసిన లేఖ అందర్నీ ఆకట్టుకుంటోంది. నాని నటించిన "జెంటిల్‌మేన్" సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన నివేదా నానికి మంచి ఫ్రెండ్. నాని భార్య, ఆయన కుటుంభసభ్యులతోనూ మంచి స్నేహం ఏర్పరచుకొంది. నాని సరసన "నిన్నుకోరి"లోనూ నటించిన నివేదా.. ఈ సందర్భంగా రాసిన లేఖలో నాని తనకి ఎలా స్పూర్తినిచ్చాడో వివరించింది. చెన్నైలో నివాసం ఉండే సుందరి హైదరాబాద్‌కి వస్తే నాని ఇల్లు కూడా సొంత ఇల్లులా భావిస్తుందట. అంతగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారింది. అందుకే ఒక హీరోకి అభిమాని రాస్తున్న లేఖ అని ట్వి్ట్టర్లో పోస్ట్ చేసింది.
- Log in to post comments