అన్నిసార్లూ బావనే వాడుకోవద్దు!

సుధీర్‌బాబు సినిమా విడుదల అవుతోందంటే మహేష్‌బాబు ప్రమోషనల్ ఈవెంట్‌కి రావాల్సిందే. ఇప్పటి వరకు అలాగే జరుగుతూ వచ్చింది. మహేష్‌బాబు సోదరిని పెళ్లి చేసుకున్నాడు సుధీర్‌బాబు. అందుకే బావ కోసం మహేష్‌బాబు ఆల్వేస్ ప్రమోషన్‌కి రెడీ అంటాడు. ఐతే సుధీర్‌బాబు ఇపుడు సొంతంగా హీరోగా నిలదొక్కుకోవాలనుకుంటున్నాడు.
"సమ్మోహనం" సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో నిర్మాతగా మారాడు. "నన్ను దోచుకుందువటే" సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఈ వీకెండ్ విడుదల కానుంది. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్‌బాబుని ఆహ్వానించలేదు. ఎందుకు అంటే మహేష్‌బాబుని మరీ ఎక్కువగా వాడేస్తున్నానని ఫీలింగ్ వచ్చిందట. అందుకే ఈ సారి తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు సుధీర్‌బాబు.
ఐతే సినిమా బాగుంటే.. రిలీజ్ రోజు తన ట్వీట్‌తో ప్రమోట్ చేస్తాడు మహేష్‌బాబు. అది గ్యారెంటీ. "నన్ను దోచుకుందువటే" సినిమాని కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు డైరక్ట్ చేశాడు. నభా నటేష్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుధీర్‌బాబు నిర్మించాడు ఈ మూవీని.
- Log in to post comments