టీవీ యాంకర్ రవిపై కేసు నమోదు
Submitted by tc editor on Sun, 2018-10-28 14:49
Case filed on TV anchor Ravi
Sunday, October 28, 2018 - 14:45

వ్యక్తిని బెదిరించిన వ్యవహారంలో పలు టీవీ షోలతో పాపులర్ అయిన యాంకర్ రవి పై కేసు నమోదు అయింది. బాకీ వసూలు కోసం యాంకర్ రవి తనను ఫోన్‌లో బెదిరించాడని డిస్ట్రిబ్యూటర్ సందీప్ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు ఇరవై మందితో కలిసి వచ్చిన తనపై దాడికి ప్రయత్నించాడని ఆయన పోలీసులకి చెప్పాడు.
డబ్బు తీసుకోవడం, తిరగి చెల్లించడంలో ఇద్దరికి మధ్య గొడవ వచ్చిందట. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు రవి మీద కేసు నమోదు చేశారు. విచారణ కోసం ఎపుడు పిలిచినా రావాలని పోలీసులు రవికి చెప్పారు.
- Log in to post comments