పిచ్చి చూపులని టర్మినేట్ చేయనున్నారా?

పెళ్లిచూపులు సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో రూపొందిన రియాల్టీ షో మాత్రం అట్టర్‌ఫ్లాప్ అయింది.
హిందీలో పాపులర్ అయిన బిగ్‌బాస్ షోని తెలుగులోకి తెచ్చినపుడు అంత పెద్ద హిట్టయింది కదా. మరి స్వయంవర్ కాన్సెప్ట్‌ని తెలుగులో తెస్తే ఎందుకు కాదు అనే ఆలోచనతో పెళ్లిచూపులు షోని దించింది స్టార్ మా. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టే చాలా అతిగా ఉంది. మన తెలుగునాట ఇంత ఓవర్ యాక్షన్ చూడరు. దానికి తోడు.. అమ్మాయిలు కోరుకునే మన్మధుడి ప్లేస్‌లో యాంకర్ ప్రదీప్‌ని పెట్టడం మరీ దారుణం. అతన్ని అమ్మాయిల కలల రాకుమారుడు అని ఎవరైనా అనగలరా?
ప్రదీప్‌ని పెళ్లి చేసుకుందామనుకునే అమ్మాయిలు రకరరకాలు విన్యాసాలు చేయడం అనేది జుగుప్స కలిగించింది. తనని చూసి అమ్మాయిలు అంత ఎగ్జయిట్ అవుతారా అని ప్రదీపే ఆశ్చర్యపోయేలా చేశారు ఈ షోకి వచ్చిన భామలు. దాంతో ఈ షోకి పిచ్చి చూపులని, పచ్చి చూపులని ఇలా పేర్లు పెట్టారు జనం.
ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుండడం, ప్రోగ్రామ్‌కి రేటింగ్‌లు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇక దీన్ని టర్మినేట్ చేయాలని స్టార్ మా ఆలోచిస్తోందట. త్వరలోనే దీనిపై నిర్ణయం రావొచ్చు.
- Log in to post comments