మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి బిగ్ ఝలక్

బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరుంది అమీర్‌ఖాన్‌కి. ఆయన ఏ సినిమా చేసినా..అది వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది. అమీర్‌ఖాన్‌కి తన సినిమా నచ్చకపోతే ఆ సినిమా రిలీజ్ డేట్‌ని వాయిదా వేసి అనేక రిపేర్లు చేస్తాడు. అందుకే అంత సక్సెస్ రేట్ ఉంది అమీర్‌కి.
ఇటీవల విడుదలైన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌కి కూడా అదే పని చేశాడు. రిపేర్లు అన్ని అయ్యాయి. ఐనా ఫలితం మారలేదు. అమీర్‌ఖాన్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలవనుంది. ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల రూపాయలకి మించి పెద్దగా వసూళ్లు సాధించే అవకాశం లేదు. ఈ సినిమాని 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఓవర్సీస్ డీల్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్, ఇతరత్రా.. 250 కోట్ల రూపాయలు వచ్చాయి. ఐతే ఓవర్సీస్‌లోనూ సినిమా ఫ్లాప్ అవుతోంది.
ఇక ఇండియాలో డిజాస్టర్. అంటే నిర్మాతకి పెద్ద లాస్ లేకపోయినా..హీరోగా అమీర్‌కి చాలా నష్టం. అమీర్‌ఖాన్ పారితోషికం తీసుకోవడం లేదు. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి వచ్చే లాభం సున్నా. అంటే అమీర్‌ఖాన్‌కి బిగ్ ఝలక్.
- Log in to post comments