కీరవాణి పాటకి నాగ్ ఫిదా

"2.0" సినిమాకి నాగార్జునకి ఏ సంబంధం లేదు. కానీ చిత్రంగా నాగార్జున ఈ సినిమా గురించి ట్వీట్ వేశాడు. 2.0లో ఒక పాట నాగ్‌కి అంతగా నచ్చిందట మరి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 500 కోట్ల రూపాయల భారీ చిత్రం ‘2.ఓ’. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. రెహమాన్ స్వరపర్చిన ‘బుల్లిగువ్వా..’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగ్ ట్వీట్ చేశాడు.. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించాడు. నాగ్ ట్వీట్ చేయడంతో ఇపుడు అందరూ ఆ పాట గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన జ్యూక్ బాక్స్ (అన్ని పాటలు) గతేడాదే వచ్చాయి. తాజాగా బుల్లి గువ్వా అనే పాటని కీరవాణితో పాడించారట.
ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.వి.ఆర్. సినిమాస్ ద్వారా ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 29న విడుదల కానుంది టూ పాయింట్ ఓ.
- Log in to post comments